nadigudeam news surayapet news bjp news local news telugu news e69news telugu galam newsనర్సక్కపల్లి ఎంపీటీసీ బుర్ర దీపా-దేవేందర్ గౌడ్.

వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలో ఎంపీటీసీ బుర్ర దీపా-దేవేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం ఉదయం వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా 150 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది..ఈ సందర్బంగా నర్సక్కపల్లి ఎంపీటీసీ బుర్ర దీపా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని,ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ఆరు గ్యారెంటీ ల హామీలను,ఐదు న్యాయ సూత్రాలను వివరిస్తూ ప్రధానిగా రాహుల్ గాంధీనీ చూడాలని కార్యకర్తలు అందరూ భావిస్తున్నట్టు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గేలిపించాలని కోరారు.ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందుటకు ప్రతి సంవత్సరము ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోడెపాక ఐలయ్య,నడికూడ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోడెపాక ప్రశాంత్,కోడెపాక ప్రమోద్ అమరేందర్,శ్రీనాథ్,బుర్ర సురేందర్,ముంజ విజేందర్, తలగంప్ప రవి,కేషిరెడ్డి రమణారెడ్డి,కిన్నెరా మల్లేష్,తదితరులు పాల్గొన్నారు..

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *