bjp news election news parakal news telugu galam news daily news e69newsబిఆర్ఎస్ నుండి 50 మంది బీజేపీలో చేరిక...

బిఆర్ఎస్ నుండి 50 మంది బీజేపీలో చేరిక…

పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణ బిఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మండల అధ్యక్షుడు దగ్గు విజేందర్ రావుతో పాటు దుబ్బాక నటరాజ్ ,పొట్లపెళ్ళి సుధాకర్ రావు, దగ్గు మాధవరావు, కొక్కిరాల సంపత్ రావు, పోలినేని విజేందర్ రావు, కొదటి బాపురావు, దగ్గు రమేష్ రావు, దగ్గు రవీందర్ రావు, దగ్గు దిలీప్ రావు, దగ్గు ప్రేమ్ చందర్ రావుతో పాటు బిఆర్ఎస్ పార్టీ నుండి 50 మంది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బిజెపి పార్టీలో చేరారు.రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజెపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దగ్గు విజేందర్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి భారతదేశానికి ఎనలేని కృషి చేస్తున్న బిజెపి పార్టీ పై ఉన్న మక్కువతో ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా రాబోయే ఎన్నికలలో మరో మారు ప్రధానిగా నరేంద్ర మోడీని చేయాలనే సంకల్పంతో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపుకై బిజెపిలో చేరానని అన్నారు. దేశం సంక్షేమంగా ఉండాలంటే నరేంద్ర మోడీ రైతుల కోసం, పేద, ధనిక వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారాని దేశమే తన కుటుంబంగా భావించే నరేంద్ర మోడీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ పి జయంత్ లాల్, రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్, పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి, జిల్లా కార్యదర్శి ఎర్రం రామన్న , మాజీ సర్పంచ్ సిరంగి సతీష్ కుమార్, పరకాల పట్టణ కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *