e69news telugu galam policet news poltechinic news e69newsప్రశాంతంగా ముగిసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులతో పాటు, వ్యవసాయ డిప్లొమా, వెటరినరీ డిప్లొమా కోర్సు లలో ప్రవేశం కొరకు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించిన పాలీసేట్ – 24 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు మహబూబాబాద్ పట్టణంలో 6 పరీక్షా సెంటర్ లలో బాలురు 887, బాలికలు 722 మొత్తం 1609 మంది విద్యార్దులకు గాను బాలురు 784, బాలికలు 645 మొత్తం 1429 మంది విద్యార్దులు హాజరయ్యారు. ఈ పర్యవేక్షణలో సాంకేతిక విద్యాశాఖ జిల్లా కో ఆర్డినేటర్ డి. శోభారాణి , ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి. రాజు, ప్రత్యేక పరిశీలకులుగా ఎం. చంద్ర ప్రకాష్ సాంకేతిక విద్యా శాఖ , ఏం. శ్రీ రాములు విద్యా శాఖ , యు. నర్సయ్య రెవిన్యూ శాఖ , యాకుబ్ రెడ్డి పోలీస్ శాఖ పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *