మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరిమహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి

కర్నూలులోని స్థానిక బి క్యాంపు నందలి యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక కార్యాలయంలో ఈ రోజు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 91 వ జయంతి వేడుక కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగింది. మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి లు కలిసి మాన్యశ్రీ కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని ఆ దిశగా బహుజనులు అందరూ ఐక్యమై పోరాడాలని కాన్షీరామ్ సూచించారని ఆమె అన్నారు. మాన్యశ్రీ కాన్షీరామ్ మహిళల పక్షపాతి అని, ఒక మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాన్షీరామ్ గారికే దక్కిందని ఆమె తెలిపారు. నీతికి నిజాయితీకి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమే కాక అంబేద్కర్ ఆశయాలకు వారసులు కాన్షీరామ్ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తన జీవిత కాలం అంబేద్కర్ ఆశయ సాధనకు, సామాజిక మార్పుకోసం నిరంతరం శ్రమించి, జ్యోతిబాపూలే అంబేడ్కర్, పెరియార్,సాహు మహారాజ్, నారాయణగురు సామాజిక ఉద్యమకారుల జీవితాలను అధ్యయనం చేసి వారి ఆలోచనా విధానాన్ని కొనసాగించిన మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్ అని ఆమె తెలిపారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *