ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు.
తాడ్వాయి లో జర్నలిస్టు శ్రీకాంత్ రెడ్డి పై  దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేగొండ మండల జర్నలిస్టుల ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జర్నలిస్టు పై దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో జర్నలిస్టులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి చేసిన వారికి  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పై దాడి చెస్తే ఇక పై సహించేది లేదని అన్నారు. వారి పై కఠిన చర్యలు తీసుకునే వరకు జర్నలిస్టుల పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ ధర్నాలో మండల జర్నలిస్టులు  పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *