పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డిపరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.

తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్ 29

  • ఈ రోజు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు.
    ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని అలాగే విద్యుత్,త్రాగునీరు, అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి సూచించారు. అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా భారీ వర్షాల వలన అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే పోలీసులకు,అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *