వర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయంవర్షాల ప్రభావంతో రైల్వే రాకపోకలకు అంతరాయం

ఈ69న్యూస్ అక్టోబర్ 29

దక్షిణ భారత రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని గంటల పాటు రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.విజయవాడ మీదుగా తిరుపతి,తమిళనాడు,కేరళ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లు భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా హైదరాబాద్ మార్గం ద్వారా మళ్లించబడ్డాయి.అయితే,వాతావరణ పరిస్థితులు మెరుగుపడడంతో రైల్వే అధికారులు రాకపోకలను మళ్లీ యథావిధిగా పునరుద్ధరించారు.ప్రస్తుతం అన్ని రైళ్లు వరంగల్ మీదుగా విజయవాడ,తిరుపతి,తమిళనాడు,కేరళ దిశగా సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి.రైల్వే అధికారులు ప్రయాణికులు బయలుదేరే ముందు సంబంధిత రైళ్ల తాజా సమాచారం కోసం రైల్వే హెల్ప్‌లైన్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *