మానవత్వం చాటిన మన్నేపల్లి కుటుంబ సభ్యులుమానవత్వం చాటిన మన్నేపల్లి కుటుంబ సభ్యులు
  • ఖమ్మం నేత్రనిధికి నేత్రాలు దానం
  • నేత్రదాన ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక అందజేత

గార్ల మండలం, కొత్త పోచారం గ్రామానికి చెందిన మన్నేపల్లి పూర్ణ చందర్ రావు ఇటీవల మృతి చెందడంతో ఖమ్మం నేత్రనిదికి నేత్రాలు దానం చేసి మన్నేపల్లి కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. సోమవారం జరిగిన పూర్ణచందర్ రావు దశదిన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులకు నేత్రదాన ప్రశంసా పత్రం మరియు జ్ఞాపికను, ఖమ్మం నేత్రనిధి బాధ్యులు పగడాల నాగేశ్వరావు, ఐ డొనేషన్ కౌన్సిలర్ పోరండ్ల హరి ప్రసాద్ గార్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా
నవ తెలంగాణ పత్రిక ఖమ్మం మాజీ జనరల్ మేనేజర్ మన్నేపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేత్రదాన ప్రాముఖ్యతను వివరిస్తూ మరియు నేత్రదానం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. అందరూ సమాజం మీద అవగాహనతో నేత్రాలు, అవయవాలు, బాడీ వంటివి వైద్య కళాశాలకు డొనేషన్ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఆఫీసు ఇంచార్జి ఆర్.ప్రకాష్, స్వేచ్చ టీవీ రిపోర్టర్ చింతా కొండలు, మన్నేపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *