సత్తుపల్లి/వేంసూరు, నవంబర్ 22 (తెలుగుగళం) న్యూస్: వేంసూరు గ్రామ సర్పంచ్ ఎండీ ఫకృద్దీన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ విభాగాలను ఆకస్మికంగా సందర్శించి విద్యాబోధన, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి చదువుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే నూతన క్రీడా సామగ్రిని ప్రారంభించారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో: గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల్లి నరసింహాస్వామి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే నూతన క్రీడా సామగ్రి