కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డికౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి

సత్తుపల్లి, నవంబర్ 22 (తెలుగుగళం) న్యూస్: సత్తుపల్లి పట్టణంలోని 21వ వార్డు కృషి బైపాస్ రోడ్డులోని జి.ఆర్.ఆర్. అపార్ట్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో కౌన్సిలర్ మందపాటి ప్రభాకర్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయనకు స్థానికులు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, సీసీ రోడ్డు నిర్మాణం, నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలను వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఎమ్మెల్యే సహకారంతో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *