e69news telugu calnders
2023 ఈ69న్యూస్ ఆంగ్లనూతనసంవత్సర క్యాలెండర్ ను ఈ రోజు హైద్రాబాద్ లోని సుందరయ్య కళానిలయంలో ఈ69 న్యూస్ సిఈఓ భానుప్రసాద్ ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరలుగా ఛానల్ ప్రారంభించిన్నప్పటి నుండి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రలలో ఎంతో మంది ప్రేక్షకులలో కి చేరింది .
ప్రజల యొక్క సమస్య లను పరిష్కరించడం లో ముందుంది
అంతే కాక ప్రజల కు ప్రభుత్వానికి వారధి లా వుండి ప్రజల మధ్య సమస్యలను ప్రభుత్వాల దృష్టి కి తీసుకెళ్తూ ఎప్పటికీ అప్పటికీ ప్రజా శ్రేయస్సు కోరుకుంటుంది
అనునిత్యం ప్రజల మధ్య రిపోర్ట్ ల ద్వారా ప్రజల సమస్యలను మా ఛానల్ ద్వారా ప్రభుత్వ అధికారుల కు తెలియజేస్తున్నారు అని పేర్కొన్నారు.
అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాను రాను డిజిటల్ మీడియా వే రోజులు రానున్నాయి అని ప్రతి మనిషి చేతిలో చరవాని వుండటం వలన క్షణ క్షణాన ఏమి జరుగుతుంది అనే విషయాలను ప్రజలకు ఎప్పటికీ అప్పుడు ప్రజలకు ఈ 69న్యూస్ చేరవేస్తుంది అని పేర్కొన్నారు.
అంతే కాక మారుమూల గ్రామాలలో వున్న కళాకారులను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ69న్యూస్ అని అన్నారు అంతే కాక కుల వృత్తులు ను అందరికీ మరో మారు ఈ తరానికి చూపిస్తుంది అని వారు తెలియజేశారు
ఛానల్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రిపోర్టర్ లకు , వీడియో ఎడిటర్ లకు , ఫొటో ఎడిటర్ లకు మరియు ఈ69న్యూస్ స్టాప్ కి , ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఛానల్ యాజమాన్యం.
