టీఆర్పీ అభ్యర్థిగా గాజా వేణుగోపాల్ నియామకంటీఆర్పీ అభ్యర్థిగా గాజా వేణుగోపాల్ నియామకం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 January, 2026E69NEWS

టీఆర్పీ అభ్యర్థిగా గాజా వేణుగోపాల్ నియామకం

టీఆర్పీ అభ్యర్థిగా గాజా వేణుగోపాల్ నియామకం

టీఆర్పీ పార్టీలో చేరిన స్వతంత్ర అభ్యర్థి-పార్టీ కండువా కప్పిన జిల్లా అధ్యక్షులు రవి పటేల్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అభ్యర్థిగా గాజా వేణుగోపాల్‌ను నియమించినట్లు టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అధికారికంగా ప్రకటించారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ టౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న గాజా వేణుగోపాల్ టీఆర్పీ పార్టీలో చేరగా, జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే నమ్మకంతోనే టీఆర్పీ పార్టీలో చేరినట్లు గాజా వేణుగోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్పీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆశయాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడై పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు టీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ,గడపగడపకు వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు చేరవేస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని గాజా వేణుగోపాల్ స్పష్టం చేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో పాటు,ఇప్పుడు టీఆర్పీ పార్టీ మద్దతుతో ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మాట్లాడుతూ, టీఆర్పీ పార్టీలో చేరిన గాజా వేణుగోపాల్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.పార్టీ సిద్ధాంతాలు, విధానాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ పార్టీ లైన్లో పనిచేసి టీఆర్పీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.18వ వార్డులో ప్రజా సమస్యలను గుర్తించి, వాటిపై ఉద్యమిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షులు అనంతల సంపత్ ఆధ్వర్యంలో గాజా వేణుగోపాల్‌తో పాటు కోడి సతీష్, సాంబయ్య, ప్రసాద్, మధు తదితరులు టీఆర్పీ పార్టీలో చేరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *