బాగిర్తిపేటలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్టబాగిర్తిపేటలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ట
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 March, 2026E69NEWS

బాగిర్తిపేటలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ట

బాగిర్తిపేటలో ఘనంగా నవగ్రహ విగ్రహ ప్రతిష్ట

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొని ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని దేవుని ఆశీస్సులు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్, గ్రామ సర్పంచ్ శ్రీలత తిరుపతి గౌడ్, కమిటీ సభ్యులు నరసింహాచారి, రామయ్య, బాబురావు, సతీష్, నరసయ్య, లింగయ్య, భద్రయ్య, రవీందర్ రెడ్డి, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతూ విశేషంగా విజయవంతమైంది.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *