విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీలకే అప్పగించాలివిద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీలకే అప్పగించాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ26 March, 2026E69NEWS

విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీలకే అప్పగించాలి

విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీలకే అప్పగించాలి

ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయాలి

–కార్మికుల సమస్యల పరిష్కరించాలి.
–వేతన సవరణ అమలు చేయాలి.
–పెండింగ్ వేతనాలు చెల్లించాలి.
–ఆర్టీసీ యూనియన్ లపై ఆంక్షలు ఎత్తివేయా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ బస్సుల విధానంతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ రక్షణ,కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని,కార్పోరేట్ సంస్థలు ఆర్టీసీలో విద్యుత్ బస్సుల నిర్వహణను చేయడం సహేతుకం కాదని వెంటనే విద్యుత్ బస్సుల నిర్వహణ ను ఆర్టీసీ కి అప్పగించాలని సిఐటియు ఖమ్మంజిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్,జిల్లా కమిటి సభ్యులు కొలికపోగు సర్వేశ్వరావు లు డిమాండ్ చేశారు.గురువారం సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆర్టీసీ సత్తుపల్లి బస్ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో డి.ఏం. కార్యాలయం ప్రధాన గేటు ఎదుట ధర్నా చేశారు.అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డి.ఏం.గురజాల లక్ష్మీ నారాయణ కు ఇచ్చారు. ధర్నాలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా నేత శీలం సత్యనారాయణరెడ్డి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం-2019 మరియు విద్యుత్ బస్సుల విధానంతో ఆర్టీసీల రక్షణ కార్మికుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందన్నారు.మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకంతో ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెరుగుతుందని తద్వారా సంస్థ విస్తరించి ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఆశించామన్నారు.అందుకు భిన్నంగా కార్పోరేట్ సంస్థలకు విద్యుత్ బస్సుల నిర్వహణ అప్పజెప్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సమర్థవంతంగా ప్రయాణికులకు ప్రయాణ సేవలు అందిస్తున్న ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ బస్సుల నిర్వహణ అప్పగించడమేంటని ఆయన ప్రశ్నించారు.వెంటనే విద్యుత్ బస్సుల విధానంలో అవసరమైన మార్పులు చేసి విద్యుత్ బస్సుల కొనుగోలు,నిర్వహణ,ఆపరేషన్ అన్నీ ఆర్టీసీ సంస్థ నిర్వహించేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.విద్యుత్ బస్సుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వాలు ఆర్టీసీలకు నిధులు సమకూర్చాలన్నారు.బస్సుల నిర్వహణ ఖర్చు,ఆదాయం కు మధ్య ఉండే వయబులిటీ గ్యాప్ ఫండ్ ను ప్రభుత్వం ఆర్టీసీకి సమకూర్చాలన్నారు.
ఆర్టీసీ కార్మికులకు 2021 మరియు 2025 వేతన సవరణలను వెంటనే అమలు చేయాలని,2017 వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని,ఉద్యోగ భద్రత,భరోసా కల్పించాలని,ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,ఆర్టీసీ లో యూనియన్ల పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్ ల విధానంలో మార్పుచేయాలని,జిసిసి పద్ధతిని రద్దు చేయాలని,ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసిలకు ఇవ్వాలని,ఆర్టీసి లే నేరుగా విద్యుత్ బస్ లు సమకూర్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలని,అందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలని,ఆర్టీసి బస్ ల ఆపరేషన్ ఖర్చుకు,ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని (వయబిలిటీ గ్యాప్ ఫండ్)ను ఆర్టీసికి ఇవ్వాలని,విద్యుత్ బస్ బాడీ ఫ్యాబ్రికేషన్ ఆర్టీసి వర్క్ షాప్ లలో చేయించాలని,అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని,ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్ ల సంఖ్యను పెంచాలని,పిఎమ్ఇ డ్రైవ్ పథకంలో ఇస్తున్న సబ్సిడీని ఆర్టీసి చేసే ‘రెట్రో ఫిట్మెంటు’ బస్ లకు కూడా వర్తింప చేయాలని,ఆర్టీసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.ఆర్టీసీ పరిరక్షణ,కార్మిక సమస్యల పరిష్కారం,సంస్థ బలోపేతం కోసం ప్రభుత్వం,
యాజమాన్యం సరైన ఆలోచన చేయకపోతే ప్రజలను సమీకరించి మరిన్ని ఆందోళన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో: సిఐటియు సభ్యులు చప్పిడి భాస్కర్,దాసు,ఐద్వా రాష్ట్ర కమిటి సభ్యురాలు శీలం కరుణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *