జడ్జిలకు మర్యాదపూర్వక సత్కారం జడ్జిలకు మర్యాదపూర్వక సత్కారం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ26 March, 2026E69NEWS

జడ్జిలకు మర్యాదపూర్వక సత్కారం

జడ్జిలకు మర్యాదపూర్వక సత్కారం

పరకాలలో ఈరోజు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి శరత్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీవల్లి శైలజ లను భూపాలపల్లి జిల్లా గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో వారు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ప్రజలకు న్యాయం అందించడంలో వారి పాత్ర ఎంతో కీలకమని గవర్నమెంట్ ప్లీడర్ పేర్కొన్నారు.న్యాయవిధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో న్యాయంపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. జగదీశ్వర్, పి.వి. వెంకటరమణ, జి. నరేష్ రెడ్డి, వి. చంద్రమౌళి, బి. స్వామి, డి. సుజయ్ రణదేవ్, ఈ. చంద్రమోహన్, క్లార్క్ అజీజ్ పాల్గొన్నారు.ఈ సత్కారం కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ, న్యాయవర్గంలో పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించేలా నిలిచింది

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *