E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ6 April, 2026E69NEWS

అధిక లోడ్‌తో టైర్లు పేలి రాకపోకలకు అంతరాయం – నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో ఘటన

ఈ69న్యూస్,వరంగల్, ఏప్రిల్ 6: వరంగల్ జిల్లా నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో అధిక లోడ్‌తో వెళ్తున్న బొలేరో వాహనం టైర్లు పేలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఎండాకాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వాహనాల్లో అనుమతికి మించి లోడ్ మోపడం వల్ల టైర్లు తట్టుకోలేక రోడ్డు మధ్యలోనే పేలిపోయినట్లు స్థానికులు తెలిపారు.ఈ ఘటనతో భారీ వాహనాలతో పాటు చిన్న వాహనాలు కూడా మధ్యలోనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసమయం పాటు రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం.ఇక ఆగి ఉన్న వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో కారు, బైక్ ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ పరిస్థితిపై ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ రవాణా శాఖ అధికారులను తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.అధిక లోడ్ మోసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపైకి అనుమతించకూడదని సూచిస్తున్నారు.అలాగే వాహనదారులు కూడా లోడ్ పరిమితులను పాటిస్తూ, టైర్ల పరిస్థితిని తరచూ పరిశీలించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *