E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 May, 2026E69NEWS

విద్యుత్ భద్రతను పాటిస్తూ ప్రమాదాలను నివారిద్దాం

ఈ69న్యూస్ జఫర్ఘడ్, మే 2

స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని జాఫర్గడ్ మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా గోడపత్రికను ఎన్పీడీసీఎల్ డిఈ బి. సారయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ పి.రణధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఈ సారయ్య మాట్లాడుతూ, విద్యుత్ భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎన్పీడీసీఎల్ పరిధిలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డివిజన్ పరిధిలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సిబ్బంది సహకారంతో క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.అవసరాన్ని బట్టి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, లూజ్ లైన్లను గుర్తించి కొత్త విద్యుత్ స్థంభాలు నాటించడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.లో వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యల శాశ్వత పరిష్కారానికి అదనపు 33 కేవీ లైన్లతో పాటు సాగరం, కొండాపూర్ ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సరఫరాలో అంతరాయం కలిగితే సిబ్బంది వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ పి.శంకర్, సిబ్బంది సురేందర్ రెడ్డి, ప్రభాకర్, రంజిత్, అన్మ్యాండ్ వర్కర్లు కృష్ణ, చంద్రమౌలి, సోమన్న, రమేష్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *