E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 May, 2026E69NEWS

స్టేషన్ ఘన్పూర్ లో భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మే 4

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనపూర్ రైతువేదికలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, మట్టి నమూనాల సేకరణ విధానం, సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై వివరించారు.ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన విత్తనాల ఎంపిక, పంటల ప్రణాళిక, ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ వినియోగం మరియు వాటి ప్రయోజనాలపై అధికారులు రైతులకు వివరించారు.కార్యక్రమంలో భాగంగా ఘనపూర్ క్లస్టర్‌కు చెందిన 10 మంది రైతులకు భూసార పరీక్ష విశ్లేషణ పత్రాలను అందజేశారు. అనంతరం డ్రోన్ ఫ్లై డెమోను ప్రదర్శించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, వైస్ ఛైర్పర్సన్ నీలా రాజమ్మ, డిప్యూటీ తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి చంద్రన్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీమతి సనా మహవీన్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *