సింగరేణి సంస్థ పరిధిలోని జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో ఏర్పాటుసింగరేణి సంస్థ పరిధిలోని జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో సంకేత, దూరవాణి వ్యవస్థ ప్రారంభం

సింగరేణి సంస్థ పరిధిలోని జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు

సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం) న్యూస్ : సింగరేణి సంస్థ పరిధిలోని జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సంకేత, దూరవాణి వ్యవస్థను సత్తుపల్లి ఏరియా ప్రధానాధికారి చింతల శ్రీనివాస్‌, ప్రధానాధికారి (పౌర విభాగం) డి వెంకటేశ్వర్లు, ప్రధానాధికారి (విద్యుత్‌–యంత్ర విభాగం) ఎస్వీ రాంమూర్తి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో తొలిసారిగా జేవీఆర్ బొగ్గు నిర్వహణ కేంద్రంలో ఈ సంకేత, దూరవాణి వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా రైలు బోగీలలో బొగ్గు లోడింగ్‌, రవాణా ప్రక్రియ మరింత వేగంగా సాగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అదనపు ప్రధానాధికారి (పౌర విభాగం) సీహెచ్‌ రామకృష్ణ, ప్రధానాధికారి కార్యాలయ ప్రత్యేక అధికారి బొల్లం శ్రీనివాసు, ఉప ప్రధానాధికారి (విద్యుత్‌–యంత్ర విభాగం) కె సోమశేఖరరావు, కిష్టారం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఏఎల్‌ఎస్‌వీ సునీల్‌వర్మ, జేవీఆర్ ఓపెన్‌కాస్ట్ విభాగ అధికారి బి రాజేశ్వరరావు, కిష్టారం ఓపెన్‌కాస్ట్ విభాగ అధికారి బి రామకృష్ణ, పౌర విభాగ అధికారి ఎ రవికుమార్‌, ఏఐటీయూసీ సహాయ శాఖ కార్యదర్శి పి సూర్యప్రకాశ్‌, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు బి కోటేశ్వరరావు, కె శ్రీనివాస్‌, సంక్షేమ అధికారి, ఏరియా అధికారులు, పౌర విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *