ఛలో కొడంగల్ విజయవంతం చేయాలిఛలో కొడంగల్ విజయవంతం చేయాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 June, 2026E69NEWS

ఛలో కొడంగల్ విజయవంతం చేయాలి

ఛలో కొడంగల్ విజయవంతం చేయాలి

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
జూన్ 28న కొడంగల్‌కు భారీ ర్యాలీ పర్వతగిరి,తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
పర్వతగిరి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28 ఆదివారం చేవెళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.”ఛలో కొడంగల్” కార్యక్రమాన్ని ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నుండి వంద మందికి తగ్గకుండా తరలి వెళ్తామన్నారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ త్వరగా నివేదిక ఇవ్వాలని కోరారు.ఉద్యమకారుల వేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయకర్త ముదురకోల నాగరాజు మాట్లాడుతూ కాలపరిమితి లేని కమిటీల పేరుతో ఉద్యమకారుల జీవితాలతో చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చకుంటే మరో ఉదృత పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షులు గరుగు రాజు, బుర శ్యామ్ గౌడ్,బొట్ల మధు, ఆకారపు రాములు, బైరి అశోక్, కత్తుల శ్రీనివాస్,గఫార్,వడ్లకొండ రమేష్,మేరుగు వెంకన్న,సంతోష్, బరిగిల విజయ,అర్షం కుమార్,బుద్దె నాగరాజు,జంగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *