E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ1 July, 2026E69NEWS

వరంగల్‌లో హోటల్‌పై పోలీసుల దాడి

ఏడుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

తెలుగు గళం న్యూస్ వరంగల్ జులై 01

వరంగల్ నగరంలోని ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న హోటల్ విహారి (రూమ్ నెం. 206)పై ఇంతేజార్‌గంజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడిలో చట్టవిరుద్ధంగా మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి 7 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, రూ.30,550 నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే పేకాట నిర్వహణకు సహకరించిన హోటల్ యజమాని, రిసెప్షనిస్ట్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *