ఆపదలో అండగా నిలవడమే చేయూత ఫౌండేషన్ లక్ష్యం
రొయ్యూరు గ్రామంలో మృతురాలి కుటుంబానికి బియ్యం, నగదు అందజేత
ఆపదలో అండగా నిలవడమే చేయూత ఫౌండేషన్ లక్ష్యం
తెలుగు గళం ఏటూరునాగారం:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన పూతల బొర్రక్క ఇటీవల మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా నిలవాలనే మానవతా దృక్పథంతో చేయూత ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫౌండేషన్ తరఫున మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యం బస్తాతో పాటు ₹2,000 నగదు అందించి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు తమ వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. అనంతరం పూతల బొర్రక్క ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. “ఆపదలో ఉన్నవారికి చేయూతనందించడమే మా ధ్యేయం” అనే నినాదంతో చేయూత ఫౌండేషన్ సమాజ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని సంస్థ సభ్యులు తెలిపారు.