నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు 07(తెలుగుగళం) న్యూస్: యూఎస్పీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్తుపల్లి మండలంలోని గంగారం, కాకర్లపల్లి ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, జీవో-25ను సవరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకటించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు యూఎస్పీసీ సత్తుపల్లి భాగస్వామ్య సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు