
ధర్మసాగర్, సెప్టెంబర్ 3 (ఈ69న్యూస్)
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జీఏఎస్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గంగారపు అజయ్ ఆదాం ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేందుకు సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.విద్యార్థులు అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గంగారపు శాంతమ్మ, బూడిద భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగారపు అమృతరావు, మరియ, ఫాదర్ అనిల్, జన్ను యాకోబు, జ్యోతి, గంగారావు, సునీత, మనవలు, మనవరాళ్లు, పాఠశాల ఉపాధ్యాయులు వేణు, గణేష్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
