Rayalaseema Open Taekwondo Championship | November 23 | Penakacherla DamRayalaseema Open Taekwondo Championship | November 23 | Penakacherla Dam

ఈ69 న్యూస్,అనంతపురం.

అనంతపురం జిల్లా తైక్వాండో అసోసియేషన్ మరియు బెస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23న రాయలసీమ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కె. శాంతరాజ్, సెక్రటరీ తులసి రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.పెనకచెర్ల డ్యామ్‌లోని నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి.ఈ ఛాంపియన్‌షిప్‌లో రాయలసీమలోని అన్ని జిల్లాల నుండి వందలాది మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటనున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీలు ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని వారు వెల్లడించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *