మక్కల కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ మద్దతు

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ మద్దతు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ధర్మసమాజ్ పార్టీ బీసీ,ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు…

జిల్లా ఆసుపత్రి పరిస్థితులపై ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం

జిల్లా ఆసుపత్రి పరిస్థితులపై ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్…

ఆర్టీసీ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

ఆర్టీసీ కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం

వరంగల్, సింగారం, నరసింహులగూడెం, ముల్కలగూడెం మీదుగా బస్సు రూట్ ఏర్పాటు•గ్రామాల ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన•కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు…

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

భూపాలపల్లి జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మధుసూదన్ స్పష్టం…

అక్రమ గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు

అక్రమ గుడుంబా తయారీపై పోలీసుల మెరుపు దాడులు

భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం కొయ్యూరు పరిధిలో అక్రమ గుడుంబా తయారీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన…

విద్యారంభానికి వేదికగా అంగన్వాడీ

విద్యారంభానికి వేదికగా అంగన్వాడీ

కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని స్థానిక నాయకులగూడెం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి ఈ రోజు సందర్శించారు. గ్రామంలోని చిన్నారుల…

పోటు రంగారావు పై కేసు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో " సేఫ్ మదర్స్ డే" లో భాగంగా నేడు వరంగల్ సికేఎం మెటర్నిటీ హాస్పిటల్ నిర్వహించిన "సేఫ్ మదర్ డే" కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాస్పిటల్‌ను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలను పరామర్శించి, వారికి వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అవసరమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉండడం సమాజ అభివృద్ధికి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. గర్భధారణ సమయంలో మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు మరియు ఇతర సదుపాయాలను మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేలా కుటుంబ సభ్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆహారం, విశ్రాంతి మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సేఫ్ మదర్ డే వంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళ సురక్షిత ప్రసవం పొందేలా అందరూ కలిసి పనిచేయాలని, తల్లి మరియు శిశువు ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రజల్లో మరింత చైతన్యం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు...ఈ కార్యక్రమంలో సి కె ఎం మెటర్నిటీ హాస్పిటల్ సూపర్డెంట్, వైద్యులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా వారి…

సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపనకు వినతి

సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపనకు వినతి

వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డికి మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ వినతి పత్రం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బంజారా సమాజ ఆరాధ్య దైవం సంత్…