E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ20 March, 2026E69NEWS

ఉగాది సందర్భంగా బద్ధి పోచమ్మకు పచ్చడి సమర్పణ

ఈ69న్యూస్ ధర్మసాగర్ (మార్చి 19):
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ దేవత బద్ధి పోచమ్మ అమ్మవారికి సంప్రదాయంగా ఉగాది పచ్చడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు, పంటల సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఉగాది పచ్చడిని ప్రసాదంగా పంపిణీ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామీణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం భక్తి, ఐక్యతను ప్రతిబింబించింది.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *