ఒక్క అవకాశం ఇవ్వండిఒక్క అవకాశం ఇవ్వండి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 February, 2026E69NEWS

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి
  • నూకల సరిత రంగారావును అక్కున చేర్చుకున్న హమాలీ కాలనీ
  • నూకల సరిత రంగారావు ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు
  • ప్రతి ఇంటి సమస్య వింటూ.. పరిష్కారానికి భరోసా..
  • మీ ఇంటి బిడ్డగా ఆదరించాలని విజ్ఞప్తి..
  • 5వ డివిజన్ ప్రజల వాసులకు స్పష్టమైన హామీ..
  • కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఐదవ డివిజన్ రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ఈ మార్పుకు కేంద్ర బిందువుగా నూకల సరిత రంగారావు నిలుస్తున్నారు. ఐదవ డివిజన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమె, దుంపలపూడి సురేష్ బాబు, డివిజన్ ముఖ్య నాయకుల సారధ్యంలో హమాలీ కాలనీలో చేపట్టిన ముమ్మర ఎన్నికల ప్రచారం ప్రజల్లో కొత్త ఆశలు రగిలించింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా కాలనీ ప్రజల గడపలు తట్టిన నూకల సరిత రంగారావు, ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను స్వయంగా విని స్పందించారు. హమాలీ కాలనీ ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల లేమి, మౌలిక వసతుల కొరతపై ఆమె స్పష్టంగా స్పందిస్తూ… తాను గెలుపొందితే ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. కాలనీలోని సర్వే నెంబరు 817లో కొనసాగుతున్న భూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని, అధికారులతో సమన్వయం చేసుకుని న్యాయం జరిగేలా చూస్తానని నూకల సరిత రంగారావు స్పష్టం చేశారు. అలాగే జిసిసి నుండి హమాలీ కాలనీ వరకు రోడ్డు వెడల్పు చేసి, వీధి దీపాల ఏర్పాటు చేయడంతో పాటు కాలనీ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
  • అంతేకాదు, కాంట్రాక్టర్స్ కాలనీకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేకంగా కృషి చేస్తానని మాట ఇచ్చారు. ప్రజల సమస్యలు ఎన్నికల సమయంలో మాత్రమే కాదు… ఏడాది పొడవునా తన బాధ్యతగా భావించి పనిచేస్తానని ఆమె స్పష్టంగా చెప్పారు.
  • హమాలీ కాలనీ ప్రజలు అభ్యర్థికి ఘన స్వాగతం పలకడం ఈ ప్రచారానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహిళలు, యువత, కార్మికులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొనడం చూస్తే ఐదవ డివిజన్‌లో మార్పు కోరుకుంటున్న గట్టి సంకల్పం స్పష్టంగా కనిపించింది. “మా కాలనీ సమస్యలు తెలిసిన నాయకురాలే మాకు కావాలి” అన్న ప్రజల స్వరం కాలనీ అంతటా ప్రతిధ్వనించింది.
  • ప్రచార కార్యక్రమంలో దుంపలపూడి సురేష్ బాబు మాట్లాడుతూ, నూకల సరిత రంగారావు ప్రజల మధ్య నుంచే ఎదిగిన నాయకురాలని, హమాలీ కాలనీతో పాటు ఐదవ డివిజన్ మొత్తం అభివృద్ధికి ఆమె బలమైన స్వరంగా నిలుస్తారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
  • ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,పట్టణ కాంగ్రెస్ నాయకులు గంగాధర్, లోగాని మురళి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజల స్పందన చూస్తే ఐదవ డివిజన్‌లో ఈసారి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారుతున్నాయన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. హమాలీ కాలనీ నుంచి మొదలైన ఈ మార్పు నినాదం… త్వరలోనే డివిజన్ అంతటా గట్టిగా మోగుతుందన్న అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *