E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ19 March, 2026E69NEWS

గట్టు మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఘనంగా ఉగాది వేడుకలు

ఈ69న్యూస్ ధర్మసాగర్: మల్లికుదుర్ల గ్రామంలోని గట్టు మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.తెల్లవారుజామున నుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణాన్ని పూలతో అందంగా అలంకరించారు.పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కొత్త సంవత్సర ఫలితాలను ఆసక్తిగా విన్న భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా పంపిణీ చేయగా, భక్తి గీతాలు, హరినామ సంకీర్తనలు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.ఈ వేడుకలకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *