నల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలునల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ13 January, 2026E69NEWS

నల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు

నల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలను గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో మహిళలకు సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంతో పాల్గొని తీరు తీరు రంగులతో అందమైన ముగ్గులను వేయడం జరిగింది. సంక్రాంతి యొక్క ప్రతిష్టతను తెలియపరిచేలా ముగ్గులను మహిళలు అలంకరించడం జరిగింది. గ్రామంలో జరిగే శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ పండగను ఉత్సాహంగా జరుపుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో మహిళలకు గ్రామ ప్రజలకు పండుగలను వాటి విశిష్టతను తెలియపరచడం కోసం ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మహిళలు పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అందరూ పండగ వాతావరణం లో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ముగ్గులు వేసిన వారికి ప్రథమ బహుమతి బోళ్ల సింధు,ద్వితీయ బహుమతి ఆకారపు శివాని రమ్యశ్రీ, తృతీయ బహుమతి పసునూరి రవీనా మౌనిక గెలుపొందడం జరిగింది. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రతి పండుగను గ్రామంలో ప్రతి పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మేకల దేవేందర్, వార్డు సభ్యులు మహమ్మద్ జమీలాభి, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ హుస్సేన్, గ్రామ ఏఈఓ శిరీష, గ్రామ కుల సంఘ పెద్దలు పోలసాని దేవేందర్రావు గొల్లపల్లి యాదగిరి, మహమ్మద్ జాఫర్, మరుపట్ల బాబు దుగ్యాల దుర్గారావు డోలి యాకయ్య బిర్రు యాకయ్య బొమ్మెర శ్రీనివాస్ బొజ్జ కృష్ణమూర్తి బొజ్జ నాగయ్య , తక్కలపల్లి శ్రీకాంత్ రావు బిర్రు రాములు బిర్రు చిన్న యాకయ్య బుర్ర చంద్రయ్య ,ప్రకాష్ కాంభోజయ్య యాకయ్య, గజ్జల దేవేందర్ పొన్నం వేణు కర్రే ఓంకార్ వెంకన్న పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *