ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలిప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ23 January, 2026E69NEWS

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

గాలివారిగూడెం సర్పంచ్ నారెడ్డి
కవిత సుదర్శన్ రెడ్డి

ప్రభుత్వ బడులను కాపాడుకొని వాటిని బలోపేతం చేయాలని గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గాలివారిగూడెం గ్రామ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో 35 మంది స్కూలు పిల్లలకు సుమారు 12 వేల విలువగల బుక్స్, యూనిఫామ్ ను పిల్లలకు అందించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులందరూ పేద పిల్లలు కావడంతో వారికి సరైన యూనిఫామ్ లేక ఇబ్బంది పడుతున్న పద్ధతిని చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కవిత సుదర్శన్ రెడ్డి తెలిపారు.స్కూల్ వైట్ యూనిఫామ్, వైట్ షూస్ సాక్స్ లు స్పాన్సర్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నారెడ్డి శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ బల్లెం ఎల్లయ్య, వార్డ్ సభ్యులు ఏడెల్లి వెంకన్న, గ్రామ పెద్దలు చలమళ్ళ వెంకన్న, శవగాని ఉపేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంపల్లి వెంకన్న, స్కూల్ టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *