గౌడ సంఘం నూతన కమిటీ
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగినది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా గిరగాని వీరభద్రం గౌడ్,ఉపాధ్యక్షులుగా చేగోని లక్ష్మీనారాయణ,కార్యదర్శిగా బొమ్మన శేఖర్‌ను ఎన్నుకున్నారు,ఈ సందర్బంగా అధ్యక్షులు వీరభద్రం గౌడ్ మాట్లాడుతూ సంఘంలో ఐక్యత పెరిగితే సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నారు,యువతను నాయకత్వంలో భాగస్వామ్యం చేయడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, అవసరమైన వారికి అండగా నిలవడం ద్వారా సంఘం మరింత బలోపేతం అవుతుంది అన్నారు,నా ఎన్నిక కు సహకరించిన గ్రామ పెద్దలకు అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో రావుల యాకన్న,వేముల నవీన్,మొగాలాగాని ఏకాంబరం,గిరగానీ సురేష్, మొగలిగాని వెంకన్న, గిరగాని సుధీర్,సభ్యులుగా చేగోని సుధాకర్,బొల్లపల్లి బిక్షపతి,రేసు అయిలయ్య, గిరగానీ పెద్ద మల్లేశం, గిరగాని సంపత్,బలగాని ఉపేందర్,కందునూరి లింగయ్య,గిరగాని చిన్న మల్లేశం,వేముల పాపయ్య,రేసు వెంకన్న,కందునూరి మహేష్ తదితర గ్రామ గౌడ సంఘం పెద్దలు పాల్గొన్నారు.