అంగన్వాడి కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
సి డి పి ఓ మధురిమ గారి అధ్యక్షతన నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు పోషక ఆహార ప్రదర్శన కార్యక్రమం
ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు స్త్రీలు బాలింత స్త్రీలు,వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ఒక పూట భోజనంతోపాటు,పాలు,గుడ్లు అందిస్తున్నారని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యగా ఉండాలని కోరారు..నర్సంపేట 4 అంగన్వాడి కేంద్రం అందరికీ ఆదర్శంగా పనిచేస్తుందని సి డి పి ఓ మధురిమ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆటపాటలు,విద్యను అందిస్తూ పాఠశాలకు సంసిద్ధులను చేస్తున్నాము 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లలను పాఠశాలలో జాయిన్ చేయించుకుంటున్నాము అని తెలియజేశారు.దానిలో భాగంగానే గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకోవడం జరిగింది. దానికి స్థానిక కౌన్సిలర్ ఎ ల్ ఎం స్ సి కమిటీ చైర్మన్ రోజా రాణి మాట్లాడుతూ.అంగన్వాడీ కేంద్రంలో ఎక్కువమంది పిల్లలు లబ్ధిదారులు ఉన్నారని,పాఠశాల భవనంలో రెండు రూములే ఉన్నందున చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,నర్సంపేట శాసనసభ్యులు మాధవ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వారితో మాట్లాడి అంగన్వాడి కేంద్ర భవన నిర్మాణం కోసం కృషి చేస్తామని 19వ వార్డు కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్ 19,20 వార్డుల పరిధిలో గల ఈ అంగన్వాడీ కేంద్రంలో టీచర్స్ మరియు సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు, సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని,అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిల్లల తల్లులకు తెలిపారు.
స్థానిక అంగన్వాడి టీచర్ నల్ల భారతి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వ మే నెలలో సెలవులు ఇస్తూ టి హెచ్ ర్ ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చినందున తల్లి బిడ్డలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు,వేసవి నెలలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని,చల్లని వాతావరణంలో ఉంచుతూ వారి ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లులకు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్, సి డి పి ఓ కౌన్సిలర్స్ చేతుల మీదుగా పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ శ్రీరామోజు రోజా రాణి,ఎలకండి విజయ్ కుమార్,పొన్నాల మనిషా,సూపర్వైజర్ అరుణ,పోషణ అభియన్ కోఆర్డినేటర్ శ్రీలత,అంగన్వాడీ టీచర్స్ నల్లా భారతి, ఎం డి గౌసియా,ఆయా సునీత,విద్యా కమిటీ చైర్మన్ క్యాతం తేజశ్రీ,ఆశా కార్యకర్తలు రాజమణి, రమ, ర్ పి లు రజిత,ఉమ, ఎ ల్ ఎం స్ సి కమిటీ సభ్యులుచంకేసిఅనిత,గూడూరు రమ్య, చామంతుల మానస,పొనగంటి సహస్ర,బూస ప్రవళిక,మౌనిక,సిద్రా ముజాహిద్,నుస్రత్,సాజియా,ఆసిఫా,కవిత,సుస్మిత,దివ్య,శిరీష,సరిత,తల్లులు వారి పిల్లలు పాల్గొన్నారు