అక్రమంగా నిల్వ చేసిన LPG సిలిండర్లు స్వాధీనం
జిల్లా సివిల్ సప్లయ్ అధికారి (DCSO) సిబ్బందితో కలిసి అక్రమ LPG సిలిండర్ల నిల్వపై మూడు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 39 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోవడమైనది. ఇట్టి అక్రమ నిల్వకు పాల్పడిన వారీపై 6A కేసులు నమోదు చేయబడ్డాయి.
- రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో తనిఖీ సందర్భంగా అక్రమంగా నిల్వ చేసిన 32 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోబడ్డాయి. మీసేవా ఆపరేటర్ అయిన జంగాల దుర్గారావు మీద అవశ్యక వస్తువుల చట్టం(EC,Act)కింద 6A కేసు నమోదు చేయబడింది.
- ఖమ్మం NTR సర్కిల్లో గల భవాని బిర్యాని హోటల్లో నిర్వహించిన తనిఖీలో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న 3 గృహ వినియోగ సిలిండర్లను ఉపయోగించిన నేరానికి 6A కేసు నమోదు చేయబడింది.
- రఘునాథపాలెంలోని సితారా హోటల్లో తనిఖీ జరిపి అక్రమంగా నిల్వ చేసిన 4 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోబడ్డాయి. హోటల్ నిర్వాహకుడిపై 6A కేసు నమోదు చేయబడింది.
📍LPG వినియోగదారులకు తెలియజేయవలసినదేమిటంటే, గృహ అవసరాల కొరకు మాత్రమే సరఫరా అయ్యే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అలాంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన వారు వెంటనే DCSO కార్యాలయానికి సమాచారం అందించవలసిందిగా కోరారు.