అక్రమంగా నిల్వ చేసిన LPG సిలిండర్లు స్వాధీనంఅక్రమంగా నిల్వ చేసిన LPG సిలిండర్లు స్వాధీనం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ20 March, 2026E69NEWS

అక్రమంగా నిల్వ చేసిన LPG సిలిండర్లు స్వాధీనం

అక్రమంగా నిల్వ చేసిన LPG సిలిండర్లు స్వాధీనం

జిల్లా సివిల్ సప్లయ్ అధికారి (DCSO) సిబ్బందితో కలిసి అక్రమ LPG సిలిండర్ల నిల్వపై మూడు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 39 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోవడమైనది. ఇట్టి అక్రమ నిల్వకు పాల్పడిన వారీపై 6A కేసులు నమోదు చేయబడ్డాయి.

  1. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో తనిఖీ సందర్భంగా అక్రమంగా నిల్వ చేసిన 32 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోబడ్డాయి. మీసేవా ఆపరేటర్ అయిన జంగాల దుర్గారావు మీద అవశ్యక వస్తువుల చట్టం(EC,Act)కింద 6A కేసు నమోదు చేయబడింది.
  2. ఖమ్మం NTR సర్కిల్‌లో గల భవాని బిర్యాని హోటల్‌లో నిర్వహించిన తనిఖీలో వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్న 3 గృహ వినియోగ సిలిండర్లను ఉపయోగించిన నేరానికి 6A కేసు నమోదు చేయబడింది.
  3. రఘునాథపాలెంలోని సితారా హోటల్‌లో తనిఖీ జరిపి అక్రమంగా నిల్వ చేసిన 4 LPG సిలిండర్లు స్వాధీనం చేసుకోబడ్డాయి. హోటల్ నిర్వాహకుడిపై 6A కేసు నమోదు చేయబడింది.

📍LPG వినియోగదారులకు తెలియజేయవలసినదేమిటంటే, గృహ అవసరాల కొరకు మాత్రమే సరఫరా అయ్యే LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. అలాంటి అక్రమ కార్యకలాపాలను గమనించిన వారు వెంటనే DCSO కార్యాలయానికి సమాచారం అందించవలసిందిగా కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *