అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు
ఏప్రియల్ 14 నుండి 20 వ తేదీ వరకు ఆరురోజులపాటు జరుగుతున్న అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన చర్యలపై సత్తుపల్లి పట్టణంలోని కిడ్స్ కేర్ ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో: సత్తుపల్లి అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు పాల్గొని, అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన భద్రతా సూచనలు వివరించారు.
ప్రమాదాల సమయంలో భయాందోళనలకు లోనుకాకుండా అప్రమత్తంగా వ్యవహరించడం, తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడం, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో: సిబ్బంది యు. వెంకటేశ్వరరావు, ఎం. సతీష్, వి. సతీష్, వై. బసవయ్య పాల్గొన్నారు.