అన్నారం షరీఫ్ అభివృద్ధికి సహకరించండి
వరంగల్ జిల్లా:పర్వతగిరి,అన్నారం షరీఫ్ గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని కీలక భూమిక పోషించాలని గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజును కోరారు.వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అనిల్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగరాజును కలిసిన సర్పంచ్ బృందం, షరీఫ్ దర్గాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించింది. గ్రామం, దర్గా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నాగరాజు,అన్నారం గ్రామం, దర్గా అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గొడుగు రమేష్, మండల యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్, వార్డు సభ్యులు గాడిపెల్లి రాజబాబు, రాపోలు అనిత-రవీందర్, గ్రామ నాయకులు గొల్లపల్లి సంతోష్, రామస్వామి, కృష్ణమోహన్, మోటపోతుల సారంగపాణి, తిరగని అఖిల్, ఇరగని మధుకర్, కాజా పాషా తదితరులు పాల్గొన్నారు.