ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే మట్టా
సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యల గురించి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ సత్తుపల్లి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. సురేష్ నారాయణ్ గురువారం సతుపల్లి మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ని కలిసి సత్తుపల్లి ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్యుల కొరత, నర్సింగ్ సిబ్బంది అవసరం, పారిశుధ్య కార్మికుల నియామకం, అత్యవసర వైద్య పరికరాల కొనుగోలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వినతిపత్రాన్ని సమర్పించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి ఈ వినతిపత్రాన్ని అందజేసి, సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, వైద్య పరికరాల సమీకరణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.