ఇంటి పట్టాలను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే
చర్ల మండలంలో కలివేరు గ్రామంలో ఇందిరమ్మ ఇంటి పట్టాలను 25 మందికి, పెద్ద మిడిసిలేరు గ్రామంలో 23 మంది లబ్ధిదారులకు మిగిలిన డబల్ బెడ్ రూం ఇల్లును ఇందిరమ్మ ఇండ్లు మార్చి పట్టాలను అందజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పేదల పాలిట వరంగా మారాయి. పేదవారి సొంతింటి కల నెరవేరుతున్న సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క, రెవెన్యూ – గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి కి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సత్కరించిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులు.