


ఈ69 న్యూస్ వరంగల్ మే26
వరంగల్ ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఎంఎ. షుకూర్ను అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్రతినిధులు సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలు, విద్యా, ఆరోగ్య సహాయం, విపత్తు సహాయక చర్యలు వంటి అంశాలను వివరించారు.సమాజంలో పరస్పర గౌరవం, సహనశీలత పెరగాలన్న ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ప్రపంచ శాంతి సాధనకు మార్గదర్శకంగా నిలిచే గ్రంథాలను ఇన్స్పెక్టర్కు బహూకరించారు.అందులో ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్ర గ్రంథంతో పాటు, అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుత 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ వివిధ దేశాల పార్లమెంట్లలో చేసిన ప్రసంగాల సంకలనం చేసిన “ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం” గ్రంథం ఉన్నాయి. ఈ గ్రంథాలు ప్రపంచ శాంతి అవసరాన్ని, నేటి సమకాలీన సమస్యలకు శాంతియుత పరిష్కార మార్గాలను సూచిస్తాయని వారు పేర్కొన్నారు.ఇన్స్పెక్టర్ షుకూర్ ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్రతినిధుల ప్రయత్నాలను అభినందించారు.సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇలాంటి చర్చలు, పరస్పర అవగాహన ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు ముహమ్మద్ సలీం, సర్కిల్ ఇంచార్జి ఆసిఫ్ ఖాదిం, జిల్లా జనరల్ సెక్రటరీ లతీఫ్ షరీఫ్, పట్టణ మిషనరీ ఇంచార్జి మౌల్వీ అయాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.