ఎస్సీ రుణాల్లో సిబిల్ స్కోర్ తొలగించాలి
BREAKING NEWS
ఎస్సీ రుణాల్లో సిబిల్ స్కోర్ తొలగించాలి
తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంను జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్ఎస్ భవన్లో చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు.శ్రీకాంత్ మాట్లాడుతూ…ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో బ్యాంకులు సిబిల్ స్కోర్ పేరుతో లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. కార్పొరేషన్ రుణాలకు సిబిల్ స్కోర్ విధానాన్ని తొలగించాలని చైర్మన్‌ను కోరారు. నల్లబెల్లి గ్రామపంచాయతీకి అధిక సంఖ్యలో రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై చైర్మన్ ప్రీతం సానుకూలంగా స్పందించి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడారు.