ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ,1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందని గుర్తుచేశారు.గత 47 ఏళ్లలో పార్టీ ఎన్నో విజయాలు సాధించి,కార్యకర్తల కృషి,త్యాగాల ఫలితంగా కేంద్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు.“నేషన్ ఫస్ట్ – పార్టీ నెక్స్ట్ – సెల్ఫ్ లాస్ట్” అనే సిద్ధాంతంతో ప్రజా సేవే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని,పార్టీ అభివృద్ధిలో కీర్తిశేషులు చందుపట్ల జంగా రెడ్డి పాత్రను స్మరించుకున్నారు.దేశంలోని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్టీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుపరిపాలన దిశగా ముందుకు సాగుతుందని,అవినీతి,బంధుప్రీతకులమత రాజకీయాలకు ముగింపు పలుకుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు,తాడికొండ రవి కిరణ్,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి,కార్యాలయ కార్యదర్శి వట్టం తిరుపతి, మీడియా ఇంచార్జ్ మునెందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలీఫ్,ఓబీసీ జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్యతో పాటు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.