రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 5
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండల కేంద్రంలోని జేఆర్ఆర్ గార్డెన్లో జరిగిన పర్వతగిరి గ్రామ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్ కుమార్తెల నూతన వస్త్ర పుష్పాలంకరణ (సారీ ఫంక్షన్) కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బోంపెల్లి దేవేందర్ రావు,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్‌లతో కలిసి మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు చిన్నారులను దీవించారు. చిన్నారులు దీర్ఘాయుష్షుతో జీవించి పేరు ప్రఖ్యాతులు తేవాలని వారు ఆకాంక్షించారు.వారి వెంట మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సునీల్ రావు,జిల్లా పరిషత్ మాజీ సభ్యులు సర్వర్, స్థానిక సర్పంచ్ శంకర్,ఉపసర్పంచ్ అనిత, నాయకులు రాంచందర్, బానోత్ భాస్కర్,నరుకుడు రవీందర్,వెంకన్న,గణేశ్,కుమార్, శ్రీనివాస్,కొమ్ము రమేష్,పాపారావు తదితరులు పాల్గొన్నారు.