జి.ఎం కార్యాలయంలో పూర్తిస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలి
సత్తుపల్లి పట్టణం సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ను కలిసిన ఐఎన్టియుసి జాయింట్ జనరల్ సెక్రెటరీ తీగల క్రాంతి కుమార్. సింగరేణిలో సత్తుపల్లి ఏరియా లో ఉద్యోగులను , అధికారులను సమన్వయపరుస్తూ ఉత్పత్తి , రవాణా సాధించుటకు కృషి చేస్తున్న ఏరియా రథసారథి చింతల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిచారు.క్రాంతి కుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన సత్తుపల్లి జనరల్ మేనేజర్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు జనరల్ మేనేజర్ ద్వారా వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా సత్తుపల్లిలో జిఎం కార్యాలయం ప్రారంభించినప్పటికీ వివిధ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించి కొత్తగూడెం వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తూ జీ.ఎం కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ వార్షిక లక్ష్యం ఉత్పత్తి సాధనలో అత్యధికంగా సత్తుపల్లి ఏరియా నుండి ఉత్పత్తి మరియు రవాణా జరుగుతున్న సందర్భంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని కోరుతూ స్థానికంగా ఉద్యోగులు ఉండే కాలనీ ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్న సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తూ పీ.వీ.ఎన్ కాలనీలో పార్కింగ్ రూఫ్ షెడ్ , కమ్యూనిటీ హాల్ , ఇండోర్ స్టేడియం , స్విమ్మింగ్ పూల్ , వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు