తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో " సేఫ్ మదర్స్ డే" లో భాగంగా నేడు వరంగల్ సికేఎం మెటర్నిటీ హాస్పిటల్ నిర్వహించిన "సేఫ్ మదర్ డే" కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాస్పిటల్‌ను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలను పరామర్శించి, వారికి వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అవసరమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉండడం సమాజ అభివృద్ధికి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. గర్భధారణ సమయంలో మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు మరియు ఇతర సదుపాయాలను మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేలా కుటుంబ సభ్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆహారం, విశ్రాంతి మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సేఫ్ మదర్ డే వంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళ సురక్షిత ప్రసవం పొందేలా అందరూ కలిసి పనిచేయాలని, తల్లి మరియు శిశువు ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రజల్లో మరింత చైతన్యం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు...ఈ కార్యక్రమంలో సి కె ఎం మెటర్నిటీ హాస్పిటల్ సూపర్డెంట్, వైద్యులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో ” సేఫ్ మదర్స్ డే” లో భాగంగా నేడు వరంగల్ సికేఎం మెటర్నిటీ హాస్పిటల్ నిర్వహించిన “సేఫ్ మదర్ డే” కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాస్పిటల్‌ను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలను పరామర్శించి, వారికి వైద్యులు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అవసరమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయా అనే విషయాన్ని కూడా ఆరా తీశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..
తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉండడం సమాజ అభివృద్ధికి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రతి గర్భిణీ మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. గర్భధారణ సమయంలో మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు మరియు ఇతర సదుపాయాలను మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండేలా కుటుంబ సభ్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ఆహారం, విశ్రాంతి మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సేఫ్ మదర్ డే వంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
ప్రతి గర్భిణీ మహిళ సురక్షిత ప్రసవం పొందేలా అందరూ కలిసి పనిచేయాలని, తల్లి మరియు శిశువు ఆరోగ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రజల్లో మరింత చైతన్యం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో సి కె ఎం మెటర్నిటీ హాస్పిటల్ సూపర్డెంట్, వైద్యులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.