డాక్టర్ తిమ్మిడి నాగరాజు(ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్)
డాక్టర్ తిమ్మిడి నాగరాజు(ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్)
వేంసూరు,జూన్02(తెలుగు గళం) న్యూస్:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం, వేంసూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి డా. తిమ్మిడి నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో: హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Good medam garu.