ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖాదీ బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఖాదీ బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి| జూన్ 9
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలం దేవీలాల్ తండా గ్రామంలో దుర్గమ్మ తల్లి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ,”గ్రామాల్లో ఎంతో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.దుర్గమ్మ తల్లి పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడే ఈ తరహా పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి”అని కొనియాడారు.
పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా భక్తిపారవశ్యంతో కోలాహలంగా మారింది.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, జాటోతు శ్రీనివాస్, బానోతు భాస్కర్, జూలపెల్లి గంగాధర్ రావు, జూలపెల్లి సురేందర్ రావు, ఎండీ సర్వర్, కరిమిల్ల సంపత్ రావు, భూషబోయిన సంపత్ యాదవ్ తో పాటు స్థానిక, మండల, పట్టణ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు