
ఈ69న్యూస్ ఖాజీపేట జూన్ 5
హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు వనం సంజన (18), వనం అర్చన (14) నీటి గుంతలో పడి మృతి చెందారు.కుటుంబ జీవనాధారమైన పందుల పెంపకం కోసం ప్రతిరోజులాగే తమ తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి గ్రామ శివారులోని నీటి గుంత సమీపానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సంజన, అర్చన నీటి గుంతలో పడిపోయి మునిగిపోయారు.సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గుంతలో నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు.ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, గ్రామస్థులు మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.