నూతన మున్సిపల్ కమిషనర్ గాకంచర్ల నరేష్ రెడ్డి
మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కమిషనర్ గా కంచర్ల నరేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కమిషనర్ రామడుగు విజయనంద్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతపై వెళుతుండగా, భువనగిరి మున్సిపల్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కే నరేష్ రెడ్డి, మరిపెడ కమిషనర్ గా వచ్చారు. కాగా మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విజయనంద్ కు వీడ్కోలు పలికి, సన్మానించారు, ఈసందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన నరేష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు