పలు అభివృద్ధి పనులకై ఎమ్మెల్యే దృష్టికి
వరంగల్ జిల్లా:వ్యవసాయ మార్కెట్ కమిటీ, వర్ధన్నపేట చైర్మన్ నరుకుడు వెంకటయ్య పాలకవర్గ సభ్యులు మార్కెట్ కార్యదర్శి వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్.నాగరాజును మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.రైతుల యొక్క ఉపయోగార్థం మార్కెట్ యార్డ్ నందు పలు అభివృద్ధి పనులు మరియు లింక్ రోడ్లు మార్కెటింగ్ మినిస్టర్ గారి ద్వారా మంజూరు చేయించాలని కోరడం జరిగింది.ఇట్టి విషయంలో పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలియజేసినారు.ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి యమ్.శ్రీనివాస రాజు, పాలకవర్గ సభ్యులు ఎండీ .ఖాజా మియా, బండి సంపత్, ఎండీ .మహమూద్, అల్లే కొమురయ్య, కాటబోయిన సంపత్, ఎద్దు శ్రీను , మాల్యాల దేవేందర్ గార్లు పాల్గొన్నారు